ఈనెల 9న ఒకే ఒక జీవితం మూవీ రిలీజ్

ఈనెల 9న ఒకే ఒక జీవితం మూవీ రిలీజ్

శర్వానంద్, రీతూవర్మ జంటగా శ్రీ కార్తీక్ రూపొందించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. అమల, వెన్నెల కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఆర్.ప్రకాష్​, ఎస్.ఆర్.ప్రభు నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతున్న సందర్భంగా నిన్న హైదరాబాద్‌‌‌‌లో ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించారు. శర్వానంద్ మాట్లాడుతూ ‘గొప్ప సినిమా చేశామనే నమ్మకం ఉంది. మనసుకు హత్తుకుంటుంది. నిన్నటి గురించి బాధ, ఆలోచనతోను.. రేపటి మీద ఆశతోను బతుకుతాం. కానీ ఈ  క్షణంలో వచ్చే ఆనందాన్ని ఎవరూ గుర్తించరు. అలా గుర్తించగలిగితే లైఫ్ బ్యూటిఫుల్‌‌‌‌గా ఉంటుంది. అందుకే మా సినిమాకి ఈ టైటిల్ పెట్టాం. ప్రమోషన్ సాంగ్ పాడిన కార్తి అన్నకు,  ట్రైలర్ లాంచ్ చేసిన ప్రభాస్ అన్నకు థ్యాంక్స్’ అని చెప్పాడు. ‘ట్రైలర్‌‌‌‌‌‌‌‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. డ్రీమ్ వారియర్ బ్యానర్‌‌‌‌‌‌‌‌లో వర్క్ చేయడం హ్యాపీ. కార్తీక్ ప్యాషనేట్ డైరెక్టర్. శర్వా ప్రతి ఎమోషన్‌‌‌‌నీ బాగా క్యారీ చేశారు. అమల మేడమ్ అందరికీ ఇన్‌‌‌‌స్పిరేషన్. ఆమె పాత్రను ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు’ అంది రీతూ వర్మ. అమల మాట్లాడుతూ ‘పదేళ్ల తర్వాత చేసిన తెలుగు సినిమా ఇది. ఇందులో అవకాశం ఇచ్చిన కార్తీక్‌‌‌‌కి, డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌‌‌‌కి థ్యాంక్స్. శర్వానంద్‌‌‌‌కి తల్లిగా నటించాను. అయితే సినిమా మొత్తం అమ్మ ప్రేమపైనే ఉండదు. ఇదొక స్పెషల్ ఫిల్మ్. ఈ సినిమాతో నాకు మూడో కొడుకు దొరికాడు’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘తమిళంలోనే  స్టోరీ రాశాను.  ఈ స్క్రిప్ట్ అందరికీ కనెక్టవుతుందనే నమ్మకంతో రెండు భాషల్లో తీశారు ప్రొడ్యూసర్.  అమ్మ సెంటిమెంట్‌‌‌‌తో కూడిన టైమ్ ట్రావెల్ సినిమా. ఈ స్క్రిప్ట్ ఒప్పుకున్న శర్వాకి, అమల గారికి థ్యాంక్స్. ఈ పాత్రకి శర్వానే పర్‌‌‌‌‌‌‌‌ఫెక్ట్. అమ్మగా అమల గారినే ఊహించుకొని కథ రాశాను. ఈ సినిమాకి ఆవిడే బలం. సిరివెన్నెల గారు రాసిన అమ్మ పాట సినిమాకి సోల్’ అని చెప్పాడు.  ‘కథ విన్నప్పుడే అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది. అన్ని ఎమోషన్స్ ఉంటాయి’ అన్నారు నిర్మాత ప్రభు.