పొలిటికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా శాసనసభ

పొలిటికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా శాసనసభ

ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘శాసనసభ’. వేణు మడికంటి దర్శకుడు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మాతలు. డిసెంబర్ 16న  ఐదు భాషల్లో విడుదల కానుంది. ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రోజా మాట్లాడుతూ ‘‘ప్రతి వాడికీ యుద్ధంలో గెలవాలని ఉంటుంది. కానీ ఒక్కడే గెలుస్తాడు. వాడినే వీరుడు అంటారు’ అనే డైలాగ్ నచ్చింది. ఫస్ట్ ప్యాన్ ఇండియా పొలిటికల్ థ్రిల్లర్ ఇది’ అని చెప్పారు.  

ఇంద్రసేన మాట్లాడుతూ ‘స్ట్రాంగ్‌‌‌‌ టైటిల్‌‌‌‌తో వస్తున్నాం. నాలాంటి కొత్త హీరోకి ఇలాంటి పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ స్ర్కిప్ట్‌‌‌‌ వచ్చినందుకు హ్యాపీ’ అన్నాడు.  తనకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది ఐశ్వర్యరాజ్.  దర్శకుడు వేణు మాట్లాడుతూ ‘ఇదొక పొలిటికల్ బ్యాక్‌‌‌‌డ్రాప్ సినిమా. అందరినీ ఆకట్టుకుంటుంది’ అన్నాడు.  ‘అద్భుతమైన ప్రాజెక్ట్‌‌‌‌తో నిర్మాతలుగా లాంచ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది’ అన్నారు నిర్మాతలు.  సతీష్ వర్మ, సురేష్ వర్మ, చిన్ని కృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ తదితరులు పాల్గొన్నారు.