అభివృద్ధికి పెట్టుబడులే కీలకం: శశాంక్ గోయల్

అభివృద్ధికి పెట్టుబడులే కీలకం: శశాంక్ గోయల్

హైదరాబాద్, వెలుగు: దేశ అభివృద్ధికి పెట్టుబడులు ఎంతో కీలకమని, ఇవి ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడతాయని ఎంసీహెచ్ ఆర్డీ డీజీ శశాంక్ గోయల్ అన్నారు.  సోమవారం నుంచి విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో  ఎంసీహెచ్ ఆర్డీలో ఫారెన్ ట్రేడ్ ఇన్వెస్ట్ మెంట్ పై  కెపాసిటీ డెవలప్ మెంట్ కోర్స్ మొదలైంది. ఈ నెల 30 వరకు సాగనున్న ఈ  కోర్స్ కు వివిధ దేశాల దౌత్యవేత్తలు హాజరయ్యారు. 

శశాంక్ గోయల్ సోమవారం కోర్సు ప్రారంభించి, మాట్లాడారు.  ఫార్మా, పుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఆటోమొబైల్ లాంటి రంగాల్లో గ్రోత్​రేట్​ఎక్కువగా ఉందన్నారు.  వేగంగా అభివృద్ధి చెందుతున్న  గ్లోబల్ మార్కెట్ లో వాణిజ్య దౌత్యవేత్తల పాత్ర గతంలో కంటే ఇప్పుడు  చాలా కీలకమైనదని పేర్కొన్నారు.