కాంగ్రెస్ నేతలతో కూడిన కాషాయ పార్టీ బీజేపీ

కాంగ్రెస్ నేతలతో కూడిన కాషాయ పార్టీ బీజేపీ

ఉత్తర ప్రదేశ్ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌, మాజీ కేంద్ర మంత్రి ఆర్‌పీఎన్ సింగ్ పార్టీని వీడి బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. ప్రధాని మోడీ కాంగ్రెస్ ముక్త్ భారత్‌, కాంగ్రెస్ రహిత భారత్ నినాదాలు ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్‌తో కూడిన బీజేపీగా కాషాయ పార్టీ మారిందన్నారు శశి థరూర్.

మరోవైపు కేవలం పిరికివాళ్లే పూర్తి విరుద్ధమైన భావజాలం ఉన్న పార్టీల్లో చేరతారని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనటె అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య  సైద్ధాంతిక పోరాటం సాగుతోందని, ఈ పోరులో నిలిచి గెలవాలంటే ధైర్యంగా ముందుకెళ్లాలని అన్నారు. 

ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో సింగ్ నిష్క్రమణ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.

 

మరిన్ని వార్తల కోసం..

రిపబ్లిక్‌ డే పరేడ్ తర్వాత విరాట్‌ రిటైర్‌‌మెంట్