
- వీరిలో 92 మంది మైనర్లే
హైదరాబాద్‌సిటీ, వెలుగు : బోనాల ఉత్సవాల్లో మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన పోకిరీలను షీ టీమ్స్పోలీసులు పట్టుకున్నారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, గోల్కొండ, లష్కర్, లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో నిఘా పెట్టగా, 644 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు షీ టీమ్స్డీసీపీ లావణ్య గురువారం తెలిపారు.
వీరిలో 92 మంది మైనర్లు ఉండడం గమనార్హం. నిందితుల్లో ఐదుగురిని (రామ్ ఆనంద్, నీలకంఠ, బాలరాజు, లక్ష్మణ్, దినేశ్) అరెస్ట్‌చేసి, నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, 7 రోజుల జైలు శిక్ష పడినట్లు తెలిపారు. పబ్లిక్ ప్లేస్‌లో మహిళలు జాగ్రత్తగా ఉండాలని, వేధింపులపై షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.