
న్యూఢిల్లీ: రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో అదరగొడుతున్న పారా ఆర్చర్ శీతల్ దేవి ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ మీట్‌లో సత్తా చాటింది. సాధారణ ఆర్చర్లతో పోటీపడి సిల్వర్ సాధించింది. హర్యానాకు చెందిన ఏక్తా రాణి గోల్డ్ గెలిచింది. బుధవారం హోరాహోరీగా జరిగిన ఇండివిడ్యువల్ కాంపౌండ్ ఈవెంట్ ఫైనల్లో ఏక్తా 140–138తో 17 ఏండ్ల శీతల్‌ను ఓడించింది. ఏక్తాకు రూ. 50 వేలు, శీతల్‌కు 40 వేల ప్రైజ్‌మనీ లభించింది.