
దుబాయి : యూఏఈ కొత్త ప్రెసిడెంట్ గా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఎమిరేట్స్ అధికారులు శనివారం ప్రకటించారు. అనారోగ్యంతో యూఏఈ ప్రెసిడెంట్, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా శుక్రవారం కన్నుమూశారు. ఈ క్రమంలో ఆయన సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ను అధికారికంగా యూఏఈ ప్రెసిడెంట్గా ప్రకటించినట్లు అక్కడి మీడియా తెలిపింది. షేక్ ఖలీఫా పదవిలో ఉన్నప్పటికీ ఆయన 2014 నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాత్కాలిక ప్రెసిడెంట్ హోదాలో షేక్ మొహమ్మద్ బిన్‌నే పాలన వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే యూఏఈపై అమెరికా జోక్యాన్ని తగ్గించడం వంటి కీలక పరిణామాలెన్నో చోటుచేసుకున్నాయి.