ధావన్ ను బోల్తా కొట్టించిన భువీ, క్లాసెన్.. అభిమానులు థ్రిల్ (వీడియో)

ధావన్ ను బోల్తా కొట్టించిన భువీ, క్లాసెన్.. అభిమానులు థ్రిల్ (వీడియో)

ఐపీఎల్ 17వ సీజన్ లో పంజాబ్ కింగ్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ అభిమానులను థ్రిల్ కు గురిచేసింది. ఇక, పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ను ఎస్ఆర్ హెచ్ బోల్తా కొట్టించిన తీరు అభిమానులతోపాటు క్రికెట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.  లక్ష్య ఛేదనలో దాటిగా ఆడేందుకు ప్రయత్నించిన  ధావన్.. ఎస్ఆర్ హెచ్ పేసర్ భువనేశ్వర్ కుమార్, కీపర్ హెన్రిచ్ క్లాసన్ మాస్టర్ ప్లాన్ కు వికెట్ సమర్పించుకున్నాడు.  అప్పటికే రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది పంజాబ్ జట్టు. ఈ క్రమంలో సన్ రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగేందుకు ప్రయత్నించాడు ధావన్. 

ఈ క్రమంలో బంతి అందుకున్న భువనేశ్వర్ కుమార్ ను టార్గెట్ చేసుకుని పరుగులు రాబట్టుకోవాలని భావించిన ధావన్.. అతని బౌలింగ్ లో పదే పదే క్రీజు వదిలి హిట్టింగ్ చేసేందుకు ప్రయత్నించాడు.  దీంతో కీపర్ క్లాసెన్ ను స్టంప్స్ కు దగ్గర కీపింగ్ చేయాలని సూచించాడు భువీ. తర్వాత లైన్ అండ్ లెంగ్త్ తో 140 కిమీ వేగంతో బంతిన విసిరగా.. శిఖర్ ధావన్ క్రీజు వదిలి షాట్ ఆడేందుకు యత్నించాడు. అయితే, బంతి మిస్ కావడంతో క్షణాల్లో దాన్ని అందుకున్న క్లాసన్.. ధావన్ తేరుకునే లోపే స్టంప్స్ ను పడగొట్టాడు.  దీంతో  ధావన్పెవిలియన్ కు చేరాడు. ధావన్ ను ఔట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ ప్లాన్ అంటూ అభిమానులు, క్రికెట్ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తూ  ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా,  ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రెండు జట్ల మధ్య జరిగిన ఈ ఉత్కంఠ పోరులో పంజాబ్ జట్టుపై హైదరాబాద్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్..‌‌‌‌‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ మెరుపు ఫిఫ్టీతో జట్టును ఆదుకున్నాడు.  మరో యంగ్ స్టర్ అబ్దుల్ సమద్ (12 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లతో 25) రాణించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్​దీప్ సింగ్‌‌‌‌‌‌‌‌ నాలుగు, హర్షల్ పటేల్, సామ్ కరన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. 

అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులకే పరిమితమైంది పంజాబ్. టాపార్డర్ ఫెయిలైనా శశాంక్ సింగ్ (25 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 46 నాటౌట్‌‌‌‌‌‌‌‌), అశుతోష్ శర్మ (15 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 నాటౌట్‌‌‌‌‌‌‌‌) పోరాడారు. రైజర్స్‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో భువనేశ్వర్ రెండు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్‌‌‌‌ విన్నింగ్ ఇన్నింగ్స్‌‌‌‌తో పాటు  ఒక వికెట్‌‌‌‌ తీసి, ఓ క్యాచ్ కూడా పట్టిన నితీశ్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అవార్డు లభించింది.