ముషీరాబాద్, వెలుగు: వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉన్నప్పటికీ మహిళలకు న్యాయం జరగడం లేదని బీజేపీ మహిలా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి విమర్శించారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్ అతని అనుచరుల చేతిలో లైంగిక వేధింపులు, చిత్రహింసలకు గురైన మహిళలకు మద్దతుగా గురువారం ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం ముందు మహిళా మోర్చా ఆందోళన చేపట్టింది.
షాజహాన్ షేక్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు పై బైఠాయించి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. పోలీసుల అడ్డుకొని వారిని అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ తరలించారు. మహిళా మోర్చా ప్రతినిధులు లక్ష్మీ పద్మజ, అనంతలక్ష్మి, గీతారెడ్డి, విజయలక్ష్మి, రమాదేవి, కవితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
