సితార బ్యానర్‌‌లో శింబు స్ట్రయిట్ తెలుగు మూవీ..

సితార బ్యానర్‌‌లో శింబు స్ట్రయిట్ తెలుగు మూవీ..

తమిళ స్టార్ శింబుకి తెలుగులోనూ క్రేజ్ ఉంది. ఆయన నటించిన  మన్మధ, వల్లభ, మానాడు లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి  గుర్తింపును అందుకున్నాడు. అలాగే ఎన్టీఆర్ ‘బాద్‌షా’, మంచు మనోజ్ నటించిన ‘పోటుగాడు’ చిత్రాల్లో పాటలు పాడిన శింబు..  ఇటీవల పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లోనూ ఓ సాంగ్ పాడి ఆకట్టుకున్నాడు. ఇదిలా  ఉంటే...  శింబు ఓ స్ట్రయిట్  మూవీతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. అతను హీరోగా సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్ బ్యానర్‌‌పై ఓ చిత్రం తెరకెక్కనుందనే న్యూస్ వైరల్ అవుతోంది.  

దీనికోసం ఓ తెలుగు దర్శకుడు స్టోరీ రెడీ చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కథను విన్న శింబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం.  శింబు 50వ చిత్రంగా ఇది రూపొందనుందని తెలుస్తోంది. ఇటీవల కమల్ హాసన్ హీరోగా మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ‘థగ్ లైఫ్‌’లో శింబు కీలక పాత్రలో కనిపించగా, ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో ‘అరసన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. శింబు కెరీర్‌‌లో ఇది 49వ సినిమా.  కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది.