శివసేన ఎమ్మెల్యే కారుపై దాడి..ఖండించిన సీఎం

శివసేన ఎమ్మెల్యే కారుపై దాడి..ఖండించిన సీఎం

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఉదయ్ సమంత్ వాహనంపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కత్రాజ్ చౌక్ వద్ద ఈ దాడి జరిగింది. ఈ ఘటనను ఎమ్మెల్యే ఖండించారు. మహారాష్ట్రలో ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ జరగవని, దాడి చేసిన వారి వద్ద బేస్ బాల్, కర్రలు, రాళ్లు ఉన్నాయన్నారు. సీఎం కాన్వాయ్ ముందు వెళుతోందని.. వారు తనను అనుసరించారా ? లేక సీఎంను అనుసరించారా అనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తారన్నారు.

అయినా.. ఇలాంటి దాడులకు తాను భయపడనన్నారు. సీఎంకు దాడి గురించి వివరించినట్లు, పోలీసులు విచారణ జరుపుతారన్నారు. ఈ ఘటనపై సీఎం ఏక్ నాథ్ షిండే స్పందించారు. ఇది పిరికిపింద చర్యగా అభివర్ణించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలను కాపాడడం తమ బాధ్యత అన్నారు. ప్రతొక్కరూ శాంతిగా ఉండేందుకు ప్రయత్నించాలని.. దాడులకు పాల్పడితే వారి సంగతి పోలీసులే చూసుకుంటారన్నారు.