హసన్ పర్తి, వెలుగు : విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహం అందించేందుకే స్కాలర్షిప్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, సెక్రెటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా ఎర్రగట్టు గుట్ట సమీపంలోని షైన్ పబ్లిక్ స్కూల్ ఆధ్యర్యంలో 4 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు (ఎస్ సాట్) మెరిట్ సాలర్షిప్ టాలెంట్ టెస్ట్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ టెస్ట్ కు 470 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్, సెక్రెటరీ మాట్లాడుతూ షైన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన షైన్ స్కాలర్షిప్ అడ్మిషన్ టాలెంట్ టెస్ట్ కు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. షైన్ పబ్లిక్ స్కూల్ జాతీయ స్థాయిలో జరిగిన ఐఐటీ, జేఈఈ, నిట్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వడం ద్వారా ఆల్ ఇండియా ర్యాంకు సాధించడం తమ స్కూల్ ప్రత్యేకత అని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్లు అన్ని బ్రాంచ్ ప్రిన్సిపల్స్పాల్గొన్నారు.
