మార్కెట్‌లోకి స్మార్ట్​​ఫోన్లు తక్కువ వస్తున్నాయ్‌

 మార్కెట్‌లోకి స్మార్ట్​​ఫోన్లు తక్కువ వస్తున్నాయ్‌

న్యూఢిల్లీ: కరోనా, రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం, ధరల పెరుగుదల వంటి సమస్యల వల్ల  ప్రపంచమంతటా స్మార్ట్​ఫోన్​ల షిప్​మెంట్లు భారీగా తగ్గాయి. పోయిన ఏడాది మొదటి మూడు నెలలతో పోలిస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (క్యూ1) షిప్​మెంట్లు 11 శాతం తగ్గాయని గ్లోబల్​ టెక్నాలజీ మార్కెట్​ ఎనలిస్ట్​ ఫర్మ్​ కెనలిస్​ తెలిపింది. ఇది విడుదల చేసిన రిపోర్టు ప్రకారం... ఇదేకాలంలో శామ్​సంగ్​ మార్కెట్​ వాటా 22 శాతం నుంచి 24 శాతానికి పెరిగింది. శామ్​సంగ్​, యాపిల్​ షిప్​మెంట్ల పరంగా మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. షావోమీ, ఒప్పో, వివో టాప్​–5 లిస్టులో ఉన్నాయి. ఫ్లాగ్​షిప్​ మోడల్​ గెలాక్సీ ఎస్​22 సిరీస్​ఫోన్లు భారీగా అమ్ముడుకావడంతో మార్కెట్​ వాటా పెరిగిందని శామ్​సంగ్​ తెలిపింది. ఎక్కువగా గిరాకీ ఉన్న గెలాక్సీ ఏ, ఎం సిరీస్​లలోనూ మోడల్స్​ సంఖ్యను పెంచింది. యాపిల్​ షిప్​మెంట్లు 2021 క్యూ1లో 15 శాతం ఉండగా, ఈసారి క్యూ1లో ఇవి 18 శాతానికి చేరాయి. కంపెనీ ఇటీవల లాంచ్​ చేసిన ఐఫోన్​ ఎస్​ఈ మోడల్​ ధర కొంచెం తక్కువ కాబట్టి డిమాండ్​ ఎక్కువగా ఉంది. ఐఫోన్​ 13 అమ్మకాలు కూడా బాగున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. 5జీ ఫోన్లను కూడా జనం ఎగబడి కొంటున్నారు. షావో, ఒప్పో షిప్​మెంట్లు ఒక్కశాతం తగ్గాయి. చిప్​ల వంటి విడిభాగాల కొరత తగ్గుతోందని, త్వరలోనే పూర్తిస్థాయి సప్లై మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని కెనలిస్ట్​ రిపోర్టు పేర్కొంది. దీనివల్ల ఖర్చులు తగ్గి రాబోయే క్వార్టర్లలో ఇండస్ట్రీ ఇంకా ముందుకు వెళ్తుందని వివరించింది.