సాయిబాబాపై అసత్య ప్రచారాలు.. 14 మంది యూట్యూబర్స్పై కేసు నమోదు

సాయిబాబాపై అసత్య ప్రచారాలు.. 14 మంది యూట్యూబర్స్పై కేసు నమోదు

దిల్ సుఖ్ నగర్, వెలుగు : సాయిబాబా అసలు దేవుడే కాదని సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్న యూట్యూబర్స్​పై షిర్డీ సాయి భక్త ఐక్యవేదిక అధ్యక్షుడు మంచికంటి ధనుంజయ్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్, ఇన్​స్ట్రాగామ్ వేదికగా  బాబా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారంటూ  14 మంది పేర్లు, క్లిప్పింగ్స్ జత చేసి  సోమవారం సరూర్​నగర్ ​పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 

కోర్టు సూచనల మేరకు 14 మందిపై  కేసు నమోదు చేశారు. ఇందులో నటి మాధవీలత కూడా ఉండడం గమనార్హం. ఆమె సనాతన అనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో   పలు వ్యాఖ్యలు చేశారని  ఫిర్యాదులో పేర్కొన్నారు.  విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఇన్​స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపారు.