అధికారం పోయినా పోరాడుతాం

అధికారం పోయినా పోరాడుతాం

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రెబెల్స్ ను ఎలాగైనా వెనక్కు తెచ్చుకునేందుకు శివసేన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. షిండే తమ మిత్రుడే అని, వెనక్కు వస్తారన్న నమ్మకం ఉందన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. పోతే అధికారం పోతుంది గానీ.. తమ పోరాటం మాత్రం ఆగబోదన్నారు. ఇవాళ ఉదయం గంటసేపు ఏక్ నాథ్ తో మాట్లాడానని, ఆయన ఎలాంటి షరతులు తమ ముందు ఉంచలేదని రౌత్ చెప్పుకొచ్చారు. అధికారం కంటే పార్టీ ప్రతిష్ఠ ముఖ్యమన్నారు. 

మరోవైపు క్షణక్షణానికి మహారాష్ట్ర రాజకీయాలు మారుతున్నాయి. కరోనా సమస్యలతో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. తాజా పరిణామాలపై కాంగ్రెస్, ఎన్సీపీలు వరుస భేటీలు నిర్వహించుకుంటున్నాయి. అలాగే మధ్యాహ్నం ఒంటిగంటకు మహారాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఉద్ధవ్ తో కమల్ నాథ్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత శరద్ పవార్ ను కలుస్తారు. ఏఐసీసీ పరిశీలకుడిగా వచ్చిన కమల్ నాథ్... మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు.