
ఉద్ధవ్ ఠాక్రే శిబిరానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. శివసేన అధికార ప్రతినిధి, ముంబై మాజీ కార్పొరేటర్ శీతల్ మ్హత్రే ఏక్‌నాథ్ షిండే శిబిరానికి చేరారు. కొంతమంది శివసేన కార్యకర్తలతో కలిసి ఆమె ఏక్‌నాథ్ షిండే వర్గానికి మద్దతు పలికారు. వారికి ఏక్‌నాథ్ షిండే స్వాగతం పలికారు. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మ్హత్రే 2012, 2017లో ఉత్తర ముంబైలోని సబర్బన్ దహిసర్‌లోని వార్డ్ నంబర్ 7కి ప్రాతినిధ్యం వహించారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సేన అలీబాగ్-పెన్ ప్రాంతానికి 'సంపర్క్ సంఘటక్' (సమన్వయకర్త)గా మ్హత్రేని నియమించింది. కాగా (BMC)కి మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి