జిన్నారంమండలంలో శివుడి విగ్రహం ధ్వంసం

జిన్నారంమండలంలో శివుడి విగ్రహం ధ్వంసం
  • ఆందోళన చేపట్టిన హిందూవాదులు

జిన్నారం, వెలుగు: మండల కేంద్రంలోని శివుడి మట్టి విగ్రహాన్ని మదర్సా స్టూడెంట్స్​ధ్వంసం చేయడంతో హిందూ వాదులు ఆందోళన  నిర్వహించారు. జిన్నారం మండల కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న శివాలయం దగ్గర శివుడి మట్టి విగ్రహాన్ని మదర్సాలో చదువుతున్న కొందరు స్టూడెంట్స్​మంగళవారం సాయంత్రం ధ్వంసం చేశారు. గమనించిన స్థానికులు వారిని ప్రశ్నించగా అక్కడి నుంచి పారిపోయి మదర్సా లోపలికి వెళ్లారు. విషయాన్ని తెలుసుకున్న హిందూవాదులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు మదర్సా ముందు బైఠాయించి ధర్నాకు దిగారు.

 పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీఎస్పీ అక్కడికి చేరుకొని మాట్లాడే ప్రయత్నం చేశారు. శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన స్టూడెంట్స్​ను శిక్షించాలని ఇక్కడి నుంచి మదర్సా ఎత్తివేసే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. మదార్సా లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగింది. ఎస్పీ పరితోశ్ పంకజ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.