శివాజీ బయోపిక్.. ఇటు రిషబ్.. అటు రితేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

శివాజీ బయోపిక్.. ఇటు రిషబ్.. అటు రితేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

‘ఛావా’ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఫిల్మ్ మేకర్స్ చూపు శివాజీ బయోపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పడింది. ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఇప్పటికే రిషబ్ శెట్టి హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేయగా, ఇప్పుడు రితేష్ దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ముఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో సినిమాను ప్రకటించారు. ‘రాజా శివాజీ’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి దర్శకత్వం కూడా రితేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వహిస్తున్నాడు.

ఆయన భార్య జెనీలియా జియో స్టూడియోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి నిర్మిస్తోంది.  ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయడంతోపాటు రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా రివీల్ చేశారు. ఫ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్తీన్ ఖాన్, మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హేశ్ మంజ్రేక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చిన్ ఖేడేక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్, జెనీలియా, భాగ్యశ్రీ ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది మే 1న పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విడుదల చేయబోతున్నట్టు చెప్పారు.  

ప్రస్తుతం ముంబైలో శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.  శివాజీ యవ్వనం,  స్వరాజ్య స్థాపన కోసం మొఘలులతో ఆయన చేసిన పోరాటాలు, సైనిక వ్యూహాలు ఇందులో చూపించబోతున్నారు. అజయ్ అతుల్ సంగీతం అందిస్తుండగా, సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్.

ఇక రిషబ్ శెట్టి హీరోగా సందీప్ సింగ్ దర్శకత్వంలో ‘ది ప్రైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఛత్రపతి శివాజీ మహారాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే చిత్రాన్ని ఫిబ్రవరిలో ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 21న రిలీజ్ అని కూడా చెప్పారు. మరి వచ్చే ఏడాది రాబోతున్న ఈ రెండు శివాజీ బయోపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏ సినిమాను ప్రేక్షకులను ఎక్కువ ఆకట్టుకుంటుందో చూడాలి!