నిర్మల్ జిల్లా మామడలో శివాజీ విగ్రహావిష్కరణ

నిర్మల్ జిల్లా మామడలో శివాజీ విగ్రహావిష్కరణ

లక్ష్మణచాంద(మామడ), వెలుగు: నిర్మల్ ​జిల్లా మామడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శుక్రవారం బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ పోరాట పటిమను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో కుమ్రం భీం విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. 

నాగదేవత, హనుమాన్ ఆలయాలకు శంకుస్థాపన

పొన్కల్ లోని సదర్మాట్ బ్యారేజ్ సమీపంలో రూ.50 లక్షలతో నాగదేవత, హనుమాన్ ఆలయాల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం గ్రామంలోని పలు సమస్యలు తెలుసుకొని, పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సదర్మాట్ బ్యారేజీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆలయ గోపురం రిపేర్లు వెంటనే చేపట్టాలి 

మండలంలోని కోరిటికల్​లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ శిఖరం గత సోమవారం పిడుగు పాటుతో ధ్వంసం కాగా మహేశ్వర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గోపురానికి వెంటనే రిపేర్లు చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు రాంనాథ్, మెడిసెమ్మ రాజు, బాపురెడ్డి, సాహెబ్ రావ్, నవీన్, ముత్యం రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.