అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శివం భజే’. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా నుంచి హీరో అశ్విన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఒంటి కాలిపై నిలబడి, ఒంటి చేత్తో మనిషిని ఎత్తి ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు అశ్విన్. అతని వెనుక దేవుడి విగ్రహం, అఘోరాలు, త్రిశూలాలు కనిపిస్తుండడం ఆసక్తి రేపుతోంది. ‘వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న న్యూ ఏజ్ సినిమా ఇదని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు తెలియజేశారు. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. హైపర్ ఆది, సాయి ధీన, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
