అప్పులపాలై ఆత్మహత్యాయత్నం చేసిన సర్పంచ్

అప్పులపాలై ఆత్మహత్యాయత్నం చేసిన సర్పంచ్

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెలగొండ గ్రామ సర్పంచ్ శివమ్మ మండల కేంద్రంలో  మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి  పురుగులమందు డబ్బాతో వచ్చారు. అప్పులు తెచ్చి పనులు చేస్తే ఫండ్స్​ రిలీజ్​ చేయడం లేదంటూ అది తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు, తోటి సర్పంచ్ లు ఆమెను అడ్డుకున్నారు. గత 4 సమావేశా సమస్యల గురించి చె;ప్పినా పరిష్కరించలేదని ఆమె అన్నారు. గ్రామంలో ఈ మధ్య కాలంలో చేపట్టిన రూ.26 లక్షల పనులకు బిల్స్​ రాక అప్పుల పాలు అయ్యాయని ఆవేదన చెందారు. గ్రామ ఉపసర్పంచ్ తో పాటు అధికారులూ తనకు సహకరించడం లేదని ఆమె కంట తడి పెట్టారు.