అందుకే నితిన్ సినిమా ఒప్పుకున్నారు.. తండ్రిపై శివాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అందుకే నితిన్ సినిమా ఒప్పుకున్నారు.. తండ్రిపై శివాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్(Rajashekhar) కూతురు శివాని(Shivani) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోటబొమ్మాళి పీఎస్‌(Kota Bommali PS). ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. నటుడు శ్రీకాంత్(Srikanth), రాహుల్ విజయ్(Rahul Vijay) లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు తేజ మర్ని(Teja Marni) తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2(Geetha Arts2) బ్యానర్ పై అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో బన్నీ వాసు(Bunny Vasu) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

తాజాగా కోటబొమ్మాళి పీఎస్‌ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నటి శివాని రాజశేఖర్. ఇందులో భాగంగా ఆమె తన తండ్రి రాజశేఖర్ గురించి మాట్లాడారు. ఆయన ప్రస్తుతం నితిన్ హీరోగా వస్తున్న ఎక్స్‌ట్రా ఆర్డినరీ మూవీలో నెగిటీవ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టారు.

ఇదే విషయం గురించి శివాని మాట్లాడుతూ.. నాన్నకి చాలా రోజుల నుంచి విలన్‌గా చేయాలని కోరిక ఉంది. ఇప్పటికే విజయ్‌ సేతుపతి, అరవింద స్వామి వంటి హీరోలు అలాంటి పాత్రలు చేస్తున్నారు. అలా విలక్షణ పాత్రలు చేయాలని నాన్నకి ఉంది. అందుకోసం చాలా కథలు విన్నారు కానీ.. కుదరలేదు. ఫైనల్ గా నితిన్‌ చేస్తున్న ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలో ఆయనకు మంచి పాత్ర దక్కింది. ఆ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే వెంటనే ఓకే చెప్పేశారు నాన్న.. అని చెప్పుకొచ్చారు శివాని. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.