కలిసి కట్టుగా పనిచేయాలి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే : శివసేన రెడ్డి

 కలిసి కట్టుగా పనిచేయాలి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే : శివసేన రెడ్డి

ఆదిలాబాద్, వెలుగు: పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ యువ పోరాట యాత్ర మంగళవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లాకు చేరుకోగా.. పాత బస్టాండ్ ఎదుట కార్నర్ మీటింగ్ నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు మావల బైపాస్ నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కుమ్రం భీం చౌక్ లో భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

అనంతరం కార్నర్ మీటింగ్​లో శివసేన రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మరోసారి మాయమాటలు చెప్పి మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఈసారి ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. ఇంటికో ఉద్యోగమని చెప్పిన కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశాడన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చరణ్ గౌడ్, నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, చారులత, రూపేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారుకల్వకుంట్ల గడీల పాలన బద్ధలు కొడ్తం

ఆసిఫాబాద్: కల్వకుంట్ల గడీలు బద్దలు కొట్టడానికే కాంగ్రెస్ యువ పోరాట యాత్ర చేపట్టామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనరెడ్డి అన్నారు. యాత్ర ఆసిఫాబాద్ ​జిల్లా కేంద్రానికి చేరుకోగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ సర్కార్​ను సాగనంపితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాదరావు, జిల్లా యూత్ అధ్యక్షుడు గుండా శ్యామ్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ సరస్వతి తదితరులు పాల్గొన్నారు..