
కరాచీ: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని అడిగితే మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ప్రాణాలు తీసేవాడినని అన్నాడు. ‘1990ల్లో కొన్ని మ్యాచ్‌లు చూశా. అసాధారణ పరిస్థితుల్లో కూడా అక్రమ్ తన అద్భుతమైన బౌలింగ్‌తో పాకిస్థాన్ టీమ్‌ను గట్టెక్కించడం చూసి ఆశ్చర్యపోయా. అలాంటి వ్యక్తి ఒకవేళ నన్ను మ్యాచ్–ఫిక్సింగ్ చేయమని చెబితే మాత్రం అతడి అంతు చూసేవాడిని. అతడి ప్రాణం తీసేవాడినని ఇప్పటికీ చెబుతున్నా. కానీ, అక్రమ్ అలాంటి పని చేయాలని నాకు ఎప్పుడూ చెప్పలేదు. అక్రమ్‌తో కలిసి నేను ఏడెనిమిదేళ్లు ఆడా. చాలా సందర్భాల్లో అతను నాకు సపోర్ట్ చేశాడు. టాపార్డర్ వికెట్లు పడగొట్టే బాధ్యత తాను తీసుకొని టెయిలెండర్ల పని నాకు మిగిల్చేవాడు. అతను నా కంటే చాలా ఎక్కువ వికెట్లు తీసినప్పటికీ కొన్ని సందర్భాల్లో నేను కోరుకున్నప్పుడు బౌలింగ్ చేయించేవాడు’ అని అక్తర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.