
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పై ఆ దేశ లెజెండరీ ఫాస్ట్ బౌలర్, మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇండియా లాంటి స్ట్రాంగ్ టీమ్ తో మ్యాచ్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని.. కానీ.. ప్రతి సందర్భంలోనూ సర్ఫరాజ్ అహ్మద్ బ్రెయిన్ లెస్ గా వ్యవహరించాడని విమర్శించాడు. తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో .. మ్యాచ్ పై ఎనాలిసిస్ ను వీడియో రూపంలో పోస్ట్ చేశాడు.
భారత్ లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుతో ఆడుతున్నప్పుడు… సర్ఫరాజ్ టాస్ గెలిచినప్పుడే మ్యాచ్ ను సగం గెలిచినట్టుగా భావించాలి. కానీ.. ఆ ఛాన్స్ మిస్ చేశాడని అన్నాడు షోయబ్. ఇది తెలివితక్కువ నిర్ణయం అన్నాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు టార్గెట్ చేజ్ చేయడం కష్టం అని తెలిసి కూడా ఫీల్డింగ్ తీసుకోవడం అంత బ్రెయిన్ లెస్ నిర్ణయం ఇంకొకటి ఉండదని చెప్పాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడని గుర్తుచేశాడు అక్తర్.
అహ్మద్ టాస్ టైమ్ లో తీసుకున్న నిర్ణయమే బ్యాక్ ఫైర్ అయిందని అన్నాడు అక్తర్. బ్రెయిన్ లెస్ కెప్టెన్సీ, బ్రెయిన్ లెస్ మేనేజ్ మెంట్, ఆలోచన లేని ఆటతీరుతో మ్యాచ్ పోగొట్టాడని సర్ఫరాజ్ పై ఫైర్ అయ్యాడు షోయబ్ అక్తర్.