సానియా మీర్జా విడాకులు తీసుకుంటుందా..? మళ్లీ ఈ వార్తల వెనక కారణాలేంటీ?

సానియా మీర్జా విడాకులు తీసుకుంటుందా..? మళ్లీ ఈ వార్తల వెనక కారణాలేంటీ?

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయాబ్ మాలిక్ విడిపోతున్నారంటూ గత ఏడాదన్నర కాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 13 ఏళ్ల తమ వైవాహిక బంధాన్ని తెంచుకునేందుకు ఈ బ్యూటీఫుల్ కపుల్ సిద్దమయ్యారనే పుకార్లు జోరుగా షికారు చేశాయి. అయితే ఈ వార్తలను ఇటు సానియా.. అటు షోయబ్ మాలిక్ ఖండించకపోవడంతో ఈ వార్తలపై అందరికీ ఓ స్పష్టత వచ్చింది. 

అయితే గత కొద్ది రోజులుగా గుప్పుగా ఉన్న ఈ విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అందుకు కారణం.. షోయాబ్ మాలిక్. ఈ పాక్ మాజీ క్రికెటర్ ఉన్నట్టుండి తన ఇన్‌స్టా బయోలో కీలక మార్పులు చేశారు. ఇటీవల కాలంలో అనేకమంది సెలబ్రిటీలు విడాకుల ప్రకటన ముందు సోషల్ మీడియా ఖాతాల్లో తమ జీవిత భాగస్వాముల వివరాలు, ఫోటోలను తొలిగిస్తున్నారు. షోయాబ్ సైతం అలాంటి పనే చేశారు. 

ఇన్‌స్టా బయో మార్చిన మాలిక్

ఇదివరకు షోయాబ్ మాలిక్ ఇన్‌స్టా బయోలో 'అథ్లెట్‌, సూపర్‌వుమన్‌ సానియా మీర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రి..' అని రాసుండేది. ప్రస్తుతం దాని స్థానంలో 'ఓ భర్తకు తండ్రి' మాత్రమే అని ఉంచారు. ఈ నేపథ్యంలో విడాకుల వార్త మరోసారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. వీరిద్దరికి అధికారంగా విడాకులు మంజూరు అయ్యాయనే ప్రచారం ఊపందుకుంది.

ప్రేమ వివాహం 

పాకిస్థాన్ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2010లో హైదరాబాద్‌ వేదికగా అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. వీరికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు ఉన్నాడు.

అక్రమ సంబంధం చిచ్చు?

సాఫీగా సాగుతున్న వీరి దాంపత్య జీవితంలో అక్రమ సంబంధం దెబ్బతీసిందనే ప్రచారం జరుగుతోంది. పాకిస్థాన్ మోడల్ అయేషా‌తో మాలిక్ సీక్రెట్ ఎఫైర్ నడుపుతున్నాడన్నది ఆ ఆరోపణల సారాంశం. ఆమెతో బంధాన్ని తెంచుకునేందుకు షోయాబ్ అంగీకరించకపోవతో సానియా విడాకులకు సిద్ధమైనట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఓ యాడ్ షూటింగ్‌లో భాగంగా అయేషాతో మాలిక్ దిగిన బోల్డ్‌ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.