అమరావతిపై సినిమా… నెలరోజుల్లో రిలీజ్ చేస్తా

అమరావతిపై సినిమా… నెలరోజుల్లో రిలీజ్ చేస్తా

ఏపీలో మూడు రాజధానులపై దాదాపు రెండు నెలలుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళా నేత అమరావతిపై సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన న్యాయవాది చందోలు శోభారాణి  అమరావతి నా రాజధాని పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు.  అమరావతిలో జరుగుతున్న ఉద్యమం వాస్తవ పరిస్థితులను రైతుల ఆందోళన నేపథ్యంలో సినిమా తీస్తానన్నారు. టీడీపీ నేత నటి దివ్యవాణితో సినిమా తీసి నెల రోజుల్లో రిలీజ్ చేస్తానన్నారు. రైతుల ఆందోళనకు జగన్ తలవంచక తప్పదన్నారు.

see more news

ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై కాల్పులు..ఒకరు మృతి

మింత్రాతో జతకట్టిన విజయ్ ‘రౌడీ‘ ఫ్యాషన్ బ్రాండ్

టీ20లకు గుడ్ బై చెప్పనున్న స్టార్ క్రికెటర్