టైం బ్యాడ్ అంటారే.. ఇలాంటి యాక్సిడెంట్ చూసినప్పుడే అనిపిస్తుంది.. టిప్పర్లో కంకర.. బస్సులోని ప్రయాణికులపై పడటం ఏంటీ..?

టైం బ్యాడ్ అంటారే.. ఇలాంటి యాక్సిడెంట్ చూసినప్పుడే అనిపిస్తుంది.. టిప్పర్లో కంకర.. బస్సులోని ప్రయాణికులపై పడటం ఏంటీ..?

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ దగ్గర సోమవారం ఉదయం 6 గంటల సమయంలో జరిగిన ప్రమాదం కలలో కూడా ఊహించం. ఇలా జరుగుతుందని.. టిప్పర్లో కంకర మీద పడి 19 మంది ప్రాణాలు పోతాయని ఏ ఒక్కరైనా అనుకుంటారా? యాక్సిడెంట్ అంటే.. వాహనాలు ఢీ కొని తీవ్ర గాయాలై ప్రమాదం జరిగిన దుర్ఘటనలు.. మితి మీరిన వేగంతో డివైడర్ను ఢీ కొట్టిన ఘటనలు.. చెట్టును ఢీ కొట్టి చనిపోయిన ఘటనలు గతంలో చాలానే చూశాం. కానీ.. ఈ ప్రమాదం జరిగిన తీరు చూస్తే మాత్రం.. ఇది విధి ఆడిన వింత నాటకం గానే కనిపిస్తుంది. ఎందుకు ఇలా అనాల్సి వస్తుందో.. ఈ ప్రమాదం జరిగిన తీరు పరిశీలిస్తే తెలుస్తుంది. 

పైన ఫొటో ఓసారి చూడండీ.. బస్సులో కంకర.. బస్సు నిండా కంకర.. చాలా జాగ్రత్తగా ఫొటో గమనిస్తే తెలుస్తుంది.. బస్సులోని ప్రయాణికులను కంకర కప్పేసింది. అవును.. ఈ కంకరే ప్రమాదంలో మరణాల సంఖ్యను పెంచింది. టిప్పర్లో ఉండాల్సిన కంకర.. బస్సులోకి ఎలా వచ్చిందో తెలుసుకుందాం..

70 మంది ప్రయాణికులతో తాండూరు నుంచి హైదరాబాద్ వస్తుంది ఈ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు.. ఈ బస్సు సరిగ్గా మీర్జాగూడ దగ్గరకు రాగానే.. రాంగ్ రూట్లో.. ఆర్టీసీ బస్సుకు కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చింది.

రాంగ్ రూట్ లో వచ్చిన కంకర టిప్పర్.. ఆర్టీసీ బస్సును సైడ్ నుంచి వేగంగా.. బలంగా ఢీకొట్టింది. టిప్పర్ ఢీ కొట్టిన దెబ్బకు ఆర్టీసీ బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. టిప్పర్ ఆర్టీసీ బస్సుపై పడింది. అంతే.. క్షణాల్లో టిప్పర్లోని టన్నుల కొద్దీ కంకర అంతా ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులపై పడింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. టిప్పర్లోని కంకర అంతా బస్సును నింపేసింది. కొంత మంది ప్రయాణికులు కంకర కింద సజీవ సమాధి అయ్యారు.. మరికొంత మంది ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు.

ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైడ్ ఉన్న ప్రయాణికులపై కంకర ఒక్కసారి పడటంతో వాళ్లందరిపై కంకర మీద పడి.. ఊపిరి ఆడక బస్సులోనే సజీవంగా సమాధి అయ్యారు. ఆర్టీసీ బస్సును.. కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీకొని ఆగిపోయి ఉంటే ఇంత మంది చనిపోయే వాళ్లు కాదు.. టిప్పర్ బస్సులో పై పడి.. టిప్పర్ లోని కంకర బస్సులోకి రావటం వల్లే మృతుల సంఖ్య 20కి చేరింది.