ఇండియన్ బాక్సాఫీస్ వద్ద విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సృష్టించిన ఫ్యూచరిస్టిక్ ప్రపంచం, చివరిలో యతి గండం, కర్ణుడిగా ప్రభాస్ ఎలివేషన్ థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. అయితే డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘డ్రాగన్’, ‘పెద్ది’, ‘టాక్సిక్’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు తమ రిలీజ్ డేట్స్‌ను వాయిదా వేసుకుంటున్న తరుణంలో.. అందరి దృష్టి ‘కల్కి 2’పై పడింది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ సైన్స్ ఫిక్షన్ సీక్వెల్ ఏకంగా డిసెంబర్ 2027 కి వాయిదా పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.
డార్లింగ్ చేతిలో అరడజను ప్రాజెక్టులు..!
ప్రస్తుతం ప్రభాస్ ఇండియన్ సినిమాలోనే అత్యంత బిజీయెస్ట్ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చేతిలో ప్రస్తుతం వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటీవలే ప్రభాస్ ‘కల్కి 2’ సెట్స్‌లో అడుగుపెట్టి కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో పాల్గొన్నప్పటికీ, ఇంకా చాలా భాగం పెండింగ్ లోనే ఉంది.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ ఏడాది ప్రభాస్ నుంచి బల్క్ డేట్స్ ఆశిస్తున్నారు. కానీ, ప్రభాస్ ఆల్రెడీ హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపధ్యంలో వస్తున్న ‘ఫౌజీ’ (Fauzi), అలాగే సందీప్ రెడ్డి వంగా మైండ్ బ్లోయింగ్ పోలీస్ డ్రామా ‘స్పిరిట్’ (Spirit) సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల ‘కల్కి 2’ నిరంతర షూటింగ్‌కు బ్రేకులు పడుతున్నాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. .
అమితాబ్, కమల్ హాసన్ సీన్లు కంప్లీట్.. కానీ ..
ఇప్పటికే అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ), కమల్ హాసన్ (యాస్కిన్) లపై కీలకమైన సన్నివేశాల షూటింగ్‌ను పూర్తి చేశారు. వచ్చే ఏడాది జూన్ నాటికి సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తాన్ని చుట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు నాగ్ అశ్విన్ . కానీ అసలైన కథ ఇక్కడే ఉంది. ‘కల్కి 2’ అనేది కేవలం సినిమా కాదు, అదొక విజువల్ వండర్. దీనికి హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ (VFX) పనులు అవసరం. ఈ సుదీర్ఘమైన పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే దాదాపు ఏడాదిన్నర సమయం పట్టేలా ఉంది. అందుకే మేకర్స్ క్లారిటీగా డిసెంబర్ 2027 ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
►ALSO READ | RashmikaVija: రష్మికతో ఫస్ట్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌తో కలిసి కేక్ కట్ చేసిన విజయ్ దేవరకొండ!
సాయి పల్లవి ఎంట్రీ!
సాధారణంగా సీక్వెల్స్ ఆలస్యమైతే క్రేజ్ తగ్గుతుంది. కానీ, ‘కల్కి 2’ విషయంలో అది రివర్స్! ఎంత ఆలస్యమైనా, యతి గండం దాటి కలియుగాంతాన్ని థియేటర్లలో చూడటానికి డార్లింగ్ ఫ్యాన్స్ డబుల్ ఎనర్జీతో వెయిట్ చేస్తున్నారు. మరో వైపు ఈ సినిమాలో సాయి పల్లవి ఒక ముఖ్యమైన పాత్రలో నటించనుంది. ఆమె పాత్రకు సంబంధించిన మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం సాయి పల్లవి ప్రతిష్టాత్మక పౌరాణిక ఇతిహాసం 'రామాయణం'తో పాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘కల్కి 2’ విడుదలపై మేకర్స్ ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి మరి.
