హైదరాబాద్ పాత బస్తీలో యువకుడి దారుణ హత్య

హైదరాబాద్ పాత బస్తీలో యువకుడి దారుణ హత్య

హైదరాబాద్: చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాంద్రాయణ గుట్ట సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తిని  చంపినట్లు పోలీసులు గుర్తించారు. గొంతుపై చాకుతో కొట్టిన గుర్తులు ఉన్నాయి. చాంద్రాయణ గుట్ట ఇన్స్పెక్టర్ గోపి, క్లూస్ టీమ్, డాగ్స్ టీమ్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. 

సంఘటనా స్థలానికి చేరుకున్న చాంద్రాయణ గుట్ట ఏసీపీ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం వేళ ఒక వ్యక్తి చనిపోయినట్లు సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ గోపి సంఘటన స్థలానికి చేరుకొని చెక్ చేయగా మహమ్మద్ అజీజ్ అక్తర్(26) గా గుర్తించారు. బాబా నగర్లో ఉండే ఇతనిపై ఇతనిపై కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. పాత అఫెండర్ అయిన ఇతని మెడపై గాయాలు ఉన్నాయని, కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ALSO READ : తిక్క కుదిరింది.. కదిలే ట్రైన్ లో రీల్స్ చేసింది.. తన్నులు తిన్నది