సికింద్రాబాద్‎లో భయానక ఘటన: మొండెం లేకుండా పసికందు తల కలకలం

సికింద్రాబాద్‎లో భయానక ఘటన: మొండెం లేకుండా పసికందు తల కలకలం

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్​కళాసిగూడలో మొండెం లేకుండా అప్పుడే పుట్టిన పసికందు తల కనిపించడం తీవ్ర కలకలం రేపింది. మహంకాళి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కళాసిగూడలోని చందనా ఆర్కేట్‎లో బంగారం వ్యాపారాలు నడుస్తుంటాయి. ఈ కాంప్లెక్స్ గ్రౌండ్​ఫ్లోర్ మెట్ల వద్ద ఒక ప్లాస్టి కవర్‎లో అప్పుడే పుట్టిన పసికందు తల కవర్‏లో చుట్టిఉంది. 

దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. రోడ్డు మీద నుంచి ఒక కుక్క ఆ కవర్‎ను నోటకరచుకొని ఇక్కడ పడేసినట్లు తెలిపారు. పసికందు ముఖంపై కుక్క కాటు గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే, బిడ్డ పుట్టకముందే చనిపోయిందా..?  ఆ తరువాత చంపేశారా..? ఇంకేమైనా జరిగిందా..? అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తలను గాంధీ మార్చురీకి తరలించారు.