గాల్లో ఉండగా ఫ్లైట్​ డోర్​ ఊడింది

గాల్లో ఉండగా ఫ్లైట్​ డోర్​ ఊడింది
  • ల్యాండ్​ అయ్యేదాక డోర్​ను పట్టుకొని నిలబడ్డ ప్యాసింజర్లు

బ్రెసిలియా: అదో చిన్న విమానం.. ఓ 15 నుంచి 20మంది ప్రయాణించొచ్చు.. అందరు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ జర్నీ చేస్తున్నారు.. ఇంతలో సడెన్‌‌గా ఆ విమానం తలుపు తెరుచుకుంది. అందరూ ఉలిక్కిపడ్డారు.. ఏమైందోనని కంగారు పడ్డారు. ఇద్దరు ప్యాసింజర్లు మాత్రం వెంటనే రియాక్టయ్యారు. ఆ డోరు పూర్తిగా తెరుచుకోకుండా లాగి పట్టుకున్నరు. ఫ్లైట్‌‌ ల్యాండ్‌‌ అయ్యేదాకా దాదాపు 20 నిమిషాల పాటు అలాగే నిలబడ్డారు. ఈ ఘటన బ్రెజిల్‌‌లో ఏప్రిల్‌‌ 14న జరిగింది. పశ్చిమ బ్రెజిలియన్‌‌ రాష్ట్రమైన ఎకర్‌‌‌‌లోని జోర్డావో నుంచి ఎకర్‌‌‌‌ రాజధాని రియో బ్రాంకోకు ప్యాసింజర్లతో ఓ విమానం బయలుదేరింది. ఉన్నట్టుండి ఫ్లైట్‌‌ డోరుకు ఉన్న హ్యాండ్రైల్‌‌ ఊడిపోవడంతో తలుపు దానంతట అదే తెరుచుకుంది. డోరు నుంచి ఊడిపోయిన హ్యాండ్రైల్‌‌.. ఫ్లైట్‌‌కు లెఫ్ట్‌‌ సైడ్‌‌ ఉన్న ఇంజన్‌‌ ప్రొపెల్లర్‌‌‌‌ (ఫ్యాన్‌‌ లాంటి రెక్కలు)కు తాకింది. సపోర్ట్‌‌ కేబుల్స్‌‌ తెగిపోవడంతో డోర్‌‌‌‌ తెరుచుకుంది. పూర్తిగా తెరుచుకోకుండా ఇద్దరు ప్యాసెంజర్లు డోరును పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌గా మారింది.