ఓ స్టోర్​లో రెచ్చిపోయిన ఉన్మాది.. ముగ్గురు మృతి

ఓ స్టోర్​లో రెచ్చిపోయిన ఉన్మాది.. ముగ్గురు మృతి

సియాటెల్‌: అమెరికాలో మరో కాల్పుల ఘటన జరిగింది. వాషింగ్టన్​యకీమాలోని ఓ స్టోర్​లో ఉన్మాది జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. ఆ తర్వాత వేరే వ్యక్తి ఫోన్​ నుంచి తల్లికి కాల్ చేసి వారిని తానే చంపినట్టు నిందితుడు వెల్లడించాడు. తాను కూడా చనిపోతానని చెప్పాడు. ఉన్మాది మాటలు విన్న ఫోన్​ ఓనర్..​అతడి వివరాలను 911కు తెలియజేసింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే సరికే తనను తాను కాల్చుకుని నిందితుడు చనిపోయాడు. అమెరికాలో ఎనిమిది రోజుల్లో ఇది ఆరో కాల్పుల ఘటన.

స్టోర్ లో ఇద్దరు.. బయట ఒకరు..

యకీమాకు చెందిన 21 ఏండ్ల జరీడ్​ హడాక్​ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మంగళవారం సాయంత్రం తను టార్గెట్ చేసిన కన్వీనియన్స్​ స్టోర్​కు జరీడ్​ వచ్చాడు. అక్కడ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. స్టోర్​ బయటకు వచ్చిన అతడు కారులో ఉన్న మరో వ్యక్తిని కాల్చడంతో అతను కూడా చనిపోయాడు. ఓ మహిళ ద్వారా నిందితుడి వివరాలు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హంతకుడు దాక్కున్న వేర్​ హౌస్​ను చుట్టుముట్టారు. కానీ, అప్పటికే నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

పెంపుడు కుక్క గన్​పై కూర్చోడంతో..

అమెరికాలోని సమ్మర్​ కౌంటీలో వేటకు కుక్క ను తీసుకున్న వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోయాడు.  కారు వెనక సీట్​లో లోడ్​ చేసిన గన్​పై కుక్క కూర్చుంది. ట్రిగ్గర్​ నొక్కు కుని తలలో నుంచి దూసుకెళ్ల డంతో కుక్క యజమాని అక్కడికక్కడే చనిపోయాడు.

ప్రమాదంలో ఏపీ యువతి మృతి

అమెరికాలోని సియాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి మృతి చెందింది. నడుచు కుంటూ వెళ్తున్న జాహ్నవిని ఓ పోలీసు కారు వెనక నుంచి ఢీ కొట్టింది. గాయాలపాలైన జాహ్నవి.. ఆస్పత్రిలో చనిపోయింది.