టీచర్లకు టెట్‌‌‌‌ పాస్ పర్సెంటేజ్ కుదించండి: ఎన్‌‌సీటీఈకి తపస్ నేతల రిక్వెస్ట్

టీచర్లకు టెట్‌‌‌‌ పాస్ పర్సెంటేజ్ కుదించండి: ఎన్‌‌సీటీఈకి తపస్ నేతల రిక్వెస్ట్

హైదరాబాద్, వెలుగు:  టెట్‌‌లో ఇన్ సర్వీస్‌‌ టీచర్లకు కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ఎన్‌‌సీటీఈ అధికారులను తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం(తపస్) కోరింది. శనివారం సంఘం నేతలు ఢిల్లీలో ఎన్‌‌సీటీఈ  చైర్ పర్సన్ ప్రొఫెసర్ యోగేశ్ సింగ్, ఇతర అధికారులను కలిశారు. టెట్‌‌పై చర్చించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎస్‌‌జీటీ టీచర్లు స్కూల్ అసిస్టెంట్‌‌గా ప్రమోషన్ పొందాలంటే  టెట్ రాయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. 

ఇలా ఇన్ సర్వీస్‌‌లో ఉన్న  వారికి టెట్ పాస్ పర్సెంటేజ్ కుదించే అవకాశాలను రాష్ట్రాలకు కల్పించాలని ఎన్‌‌సీటీఈ అధికారులను కోరారు. అలాగే.. ఎస్‌‌జీటీలకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈ అంశాల్లో సడలింపులు ఇచ్చే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ఎన్‌‌సీటీఈ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్, అయిలినేని నరేందర్ రావు, అదనపు ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య, వొద్నాల రాజశేఖర్, ఎస్. వెంకటరెడ్డి పాల్గొన్నారు.