- మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ
కోల్‌బెల్ట్,వెలుగు: క్రీడా స్ఫూర్తితో ప్రతిభను చూపాలని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ సూచించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి లెవల్ఆఫీసర్లు, కుటుంబసభ్యుల క్రీడలను జీఎం రాధాకృష్ణ-, వాణి దంపతులు, బెల్లంపల్లి రీజియన్సేఫ్టీ జీఎం కె.రఘుకుమార్, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల జీఎంలు ఎం.శ్రీనివాస్,ఎం.విజయభాస్కర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
మందమర్రిలోని ఇల్లందు క్లబ్,సీఈఆర్ క్లబ్,రామకృష్ణాపూర్‌లోని ఆర్కేసీఏఓ క్లబ్ నిర్వహించే పోటీల్లో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సీఎండీ బలరాంనాయక్ ఆదేశాలతో సోక్లస్ట్ – -2025( సింగరేణి ఆఫీసర్స్ క్లబ్స్ షటిల్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్,) పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈసారి లాన్ టెన్నిస్కూడా చేర్చారన్నారు. మూడు రోజుల జరిగే పోటీల్లో సింగరేణివ్యాప్తంగా 12 ఏరియాలకు చెందిన ఆఫీసర్లు పాల్గొంటున్నారన్నారు. ఆదివారం బహుమతి ప్రదానోత్సవానికి సీఎండీ హాజరుకానున్నట్లు చెప్పారు. ముందుగా పోటీల టార్చ్‌ను వేదిక వద్దకు తీసుకొచ్చారు.
మందమర్రి ఏరియా ఎస్వో టు జీఎం జి.లలితేంద్రప్రసాద్, సీఎంఓఏఐ ప్రెసిడెంట్ రమేశ్, శాంతి ఖని ఏజెంట్,సోక్లస్ట్ కోఆర్డినేటర్అబ్దుల్ ఖదీర్, డీజీఎం పర్సనల్ అశోక్, అన్ని ఏరియాల సీనియర్ ఆఫీసర్లు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.----
