మహిళ కడుపులో 1.2 మీటర్ల పాము!

మహిళ కడుపులో 1.2 మీటర్ల పాము!

మాస్కో(రష్యా): పాము కనబడితే బెదిరిపోయే వాళ్లు మస్తు మందుంటారు. దాన్ని చూస్తే చాలు పారిపోయే వాళ్లూ చాలా మందే ఉంటారు. అలాంటిది ఓ మహిళ పొట్టలోంచి సుమారు ఒకటిన్నర మీటర్ల పామును బయటకు తీశారు డాక్టర్లు. రష్యాలోని డగెస్టన్‌‌‌‌ ప్రాంతంలో జరిగిందీ సంఘటన. పామును ఎట్లా మింగిందో ఏమో గాని కడుపులో ఏదో తిప్పుతోందని తెలిసేసరికి ఆ మహిళను ఫ్యామిలీ వాళ్లు వెంటనే హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు ఆమెకు మత్తు మందిచ్చి గొంతులోకి ఓ పైపును దూర్చారు. కడుపులో పాము ఉన్నట్టు తెలుసుకొని షాకయ్యారు. గ్రిప్పర్ ద్వారా 1.2 మీటర్ల పామును బయటకు తీశారు. ఆ టైమ్‌‌‌‌లో పక్కనే ఉన్న నర్సు పామును చూసి ఒక్కసారిగా భయపడిపోయారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఆ పాము బతికుందా లేదా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అసలు ఆ పాము ఆమె శరీరంలోకి ఎలా వెళ్లిందో తెలియట్లేదని డాక్టర్లు చెప్పారు. ఆమెకూ తెలియకపోవడం ఇంకింత ఆశ్చర్యమంటున్నారు. కొందరు మాత్రం ఆమె నిద్రపోయినప్పుడు పాము నోట్లోకి పోయి ఉంటుందని చెబుతున్నారు.

ఆటూ మొబైల్‌ నుంచి ఆటమ్‌1.0..ఒక్క సారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ

వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..అక్కడిక్కడే ఐదుగురు మృతి