శ్రావణి ఉద్దేశపూర్వకంగానే రాజీనామా చేసింది : బీఆర్ఎస్ కౌన్సిలర్లు

శ్రావణి ఉద్దేశపూర్వకంగానే రాజీనామా చేసింది : బీఆర్ఎస్ కౌన్సిలర్లు

జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి పదవికి రాజీనామా చేయడంపై ఆ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు స్పందించారు.  శ్రావణి ఉద్దేశపూర్వకంగానే రాజీనామా చేశారని అరోపించారు. బుధవారం మధ్యాహ్నం కూర్చొని మాట్లాడుకుందామని అంతా అనుకున్న టైమ్ లో ఆమె తన రాజీనామా ప్రకటించారని చెప్పారు. ఎమ్మెల్యే సంజయ్ ను దొర అనడం బాధాకరమన్నారు. గత మూడేండ్లగా ఎమ్మెల్యే సంజయ్ అందరిని కలుపుకొని వెళ్తున్నాడని చెప్పారు. అందరి మంచి కోరే సంజయ్ పై బురదజల్లే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. ఎమ్మెల్యే సంజయ్ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు.