అప్పుడు హాస్పిటల్‌‌‌‌ బెడ్‌‌‌‌ మీద.. ఇప్పుడు టెస్ట్‌‌‌‌ టీమ్‌‌‌‌లో

V6 Velugu Posted on Nov 26, 2021

టీమిండియా యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ తన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెస్టు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌తోనే బ్యాట్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ చూపించాడు. లాంగ్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో తన సెలక్షన్‌‌‌‌‌‌‌‌కు న్యాయం చేశాడు. అసలు ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌కు శ్రేయస్‌‌‌‌‌‌‌‌ సెలక్టవడమే ఓ సర్​ప్రైజ్​. డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌క్లాస్‌‌‌‌‌‌‌‌ లెవెల్లో మంచి రికార్డు ఉన్నప్పటికీ రెండేళ్లుగా తను రెడ్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడింది లేదు. పైగా, ఈ ఏడాది మార్చిలో భుజానికి సర్జరీ కావడంతో కొన్ని రోజులు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌పై ఉన్నాడు. దాదాపు ఐదు నెలలు ఆటకు దూరంగా ఉన్న తాను ఇప్పట్లో టెస్టు  డెబ్యూ చేస్తానని శ్రేయస్‌‌‌‌‌‌‌‌ కూడా అనుకొని ఉండడు. ఎందుకంటే సర్జరీ అయిన తర్వాత ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ 14 ఫేజ్​2తో పాటు, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఆడినా పెద్ద పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ ఏమీ చేయలేదు. అయినా, టెస్టు స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌ హనుమ విహారిని కాదని సెలక్టర్లు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు.

మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో  కొంచెం స్పీడుగా ఆడే ప్లేయర్‌‌‌‌‌‌‌‌ అవసరమని, అందుకు అయ్యరే సరైనోడని భావించారు. విమర్శలు వచ్చినా.. టీమ్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ వెనక్కుతగ్గలేదు. ఈ చాన్స్‌‌‌‌‌‌‌‌ను యూజ్‌‌‌‌‌‌‌‌ చేసుకొని  తన నుంచి టీమ్‌‌‌‌‌‌‌‌ కోరుకున్నట్టుగా దూకుడైన బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను ట్రాక్‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చాడు. మొత్తంగా ఎనిమిది నెలల కిందట హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌ మీద ఉన్న అయ్యర్‌‌‌‌‌‌‌‌  ఇప్పుడు టెస్టు డెబ్యూ చేయడమే కాకుండా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనే  బెస్ట్‌‌‌‌‌‌‌‌ ఇంప్రెషన్‌‌‌‌‌‌‌‌ కొట్టేశాడు. మార్చిలో తాను హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌పై ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకున్న విజువల్స్‌‌‌‌‌‌‌‌.. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌ జెర్సీతో ఫొటో షూట్‌‌‌‌‌‌‌‌ను కలిపి చేసిన వీడియోను అయ్యర్‌‌‌‌‌‌‌‌ మంగళవారం ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. దీన్నిబట్టి  టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చేందుకు తను ఎంతగా ఆశ పడ్డాడో అర్థం చేసుకోవచ్చు.  ఇండియా 303వ టెస్టు క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా  లెజెండరీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ సునీల్‌‌‌‌‌‌‌‌ గావస్కర్‌‌‌‌‌‌‌‌ చేతుల మీదుగా  క్యాప్‌‌‌‌‌‌‌‌ అందుకోవడంతో అయ్యర్​​ కల నెరవేరింది.

Tagged test match, Shreyas Iyer, india new zealand test match

Latest Videos

Subscribe Now

More News