- విడుదల చేసిన శ్రీరామ్ ఫార్మ్ సొల్యూషన్స్
హైదరాబాద్, వెలుగు: డీసీఎం శ్రీరామ్ లిమిటెడ్‌కు చెందిన శ్రీరామ్ ఫార్మ్ రక్షణ సొల్యూషన్స్ మొక్కల సంరక్షణ కోసం స్పెషాలిటీ ప్లాంట్ న్యూట్రిషన్ ఉత్పత్తులను విడుదల చేసింది. వీటిని వాడితే కలుపు బెడద ఉండదని, నిర్వహణ ఖర్చు తగ్గుతుందని కంపెనీ తెలిపింది. పత్తి పంటల్లో కలుపు బెడదను అరికట్టడానికి ఎర్లీ పోస్ట్-ఎమర్జెంట్ సెలెక్టివ్ హెర్బిసైడ్ అయిన ‘బికుట’ను పరిచయం చేసింది.
తన క్రిమిసంహారక పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడంలో భాగంగా సైషో, క్రోన్, ట్రెక్స్టర్లను విడుదల చేసింది. ఇవి రసం పీల్చే, ఆకు నమిలే తెగుళ్ల నుంచి రక్షణను ఇస్తాయి. శ్రీరామ్ ప్రోటోబజ్ ప్లస్ అనే స్పెషాలిటీ ప్లాంట్ న్యూట్రిషన్ సాగుదారులకు మెరుగైన లాభాలను అందిస్తుందని తెలిపింది.
