
శ్రియ లీడ్ రోల్‌లో సంగీతం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. పాపారావు బియ్యాల దర్శకుడు. ప్రకాష్ రాజ్, షర్మాన్ జోషి, సుహాసిని ములాయ్, వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. పదకొండు పాటలతో ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మే 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. మంగళవారం ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి ఆల్ ద బెస్ట్ చెప్పాడు. శ్రియా, శర్మన్ మ్యూజిక్ టీచర్స్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. పిల్లలపై స్కూల్‌లో టీచర్లు, పేరెంట్స్ పెంచుతున్న ఒత్తిడి నుంచి కాస్త రిలీఫ్ ఇవ్వడం కోసం మ్యూజిక్, డ్యాన్స్ టీచర్లు చేసిన ప్రయత్నం మెప్పిస్తోంది. మ్యూజిక్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీని కూడా టచ్ చేశారు.