కనకం కన్నే కొడితే..

కనకం కన్నే కొడితే..

‘మిరాయ్’ లాంటి చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తున్న శ్రియా శరణ్.. మరోవైపు స్పెషల్‌‌ సాంగ్స్‌‌తోనూ ఆకట్టుకుంటోంది. తాజాగా ‘నాన్ వైలెన్స్‌‌’ అనే చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది.  ‘మెట్రో’ ఫేమ్ శిరీష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. గురువారం ఈ చిత్రం నుంచి ‘కనకం’ అనే పాటను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. 

యువన్ శంకర్ రాజా కంపోజ్ చేయడంతో పాటు తేజస్వి నందిభట్లతో కలిసి పాడారు.   ‘‘కనకం కన్నే కొడితే.. కసా పిసా అయిపోతారు.. అందమే ఆరా వస్తే కొంప గోడు వదిలేస్తారు.. పోకిరి కుర్రోళ్లంతా నా టచ్‌‌ కై చస్తుంటారు..’’ అంటూ భాష్యశ్రీ లిరిక్స్ రాశారు. కలర్‌‌‌‌ఫుల్‌‌ సెట్స్‌‌లో చిత్రీకరించిన ఈ పాటలో శ్రియా శరణ్‌‌ డ్యాన్స్‌‌ హైలైట్‌‌గా నిలిచింది.