శ్రీయాన్షికి టైటిల్.. తస్నిమ్ మీర్‌పై మూడు సెట్లలో విజయం

శ్రీయాన్షికి టైటిల్.. తస్నిమ్ మీర్‌పై మూడు సెట్లలో విజయం

అల్ ఐన్ (యూఏఈ): ఇండియా యంగ్ షట్లర్‌‌‌‌‌‌ శ్రీయాన్షి వలిశెట్టి  అల్ ఐన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విమెన్స్ సింగిల్స్ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీయాన్షి 15–21, 22–20, 21–7 ఇండియాకే చెందిన మాజీ వరల్డ్ జూనియర్ వరల్డ్ నంబర్ వన్ తస్నీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉత్కంఠ విజయం సాధించి చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలచింది. 18 ఏండ్ల శ్రీయాన్షి కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది తొలి బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్-100 టైటిల్ కావడం విశేషం. మరోవైపు మెన్స్ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–హరిహరణ్ విజేతలుగా నిలిచారు. ఫైనల్లో ఇండియా జోడీ 21–17, 21–18తో ఇండోనేసియాకు చెందిన రేమండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండ్రా–నికోలాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోవాక్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వరుస గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓడించింది.