వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

స్టాక్ హోం: వైద్య శాస్త్రంలో 2025 ఏడాదికి గానూ ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డు ముగ్గురిని వరించింది. రోగ నిరోధక శక్తిపై చేసిన విశేష పరిశోధనలకు గానూ శాస్త్రవేత్తలు మేరీ ఇ. బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమోన్ సకాగుచి ఈ ఏడాది మెడిసిన్‎లో నోబెల్ ప్రైజ్‎కు ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం (అక్టోబర్ 6) స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ మెడికల్ యూనివర్సిటీ నోబెల్ సెలక్షన్ ప్రకటించింది. 

శరీర రోగనిరోధక వ్యవస్థ దాని స్వంత అవయవాలపై దాడి చేయకుండా నిరోధించడానికి ఎలా అదుపులో ఉంచబడుతుందో వివరించే సంచలనాత్మక ఆవిష్కరణలకు గాను 2025 సంవత్సరానికి మెడిసిన్ నోబెల్ బహుమతిని మేరీ ఇ. బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమోన్ సకాగుచికి ప్రదానం చేసినట్లు సెలక్షన్ కమిటీ అనౌన్స్ చేసింది. 

►ALSO READ | ఆర్ యు ఆల్ రైట్ అని అడగటమే తప్పైంది.. భారత సంతతి వ్యక్తిని పాయింట్ బ్లాంక్లో షూట్ చేసిన అమెరికన్

నోబెల్ అవార్డు విజేతలకు ప్రైజ్ మనీ కింద 1.2 మిలియన్ డాలర్లు అందుకోనున్నారు. ప్రైజ్ మనీతో పాటు స్వీడన్ రాజు బహూకరించిన బంగారు పతకాన్ని అందిస్తారు. 2025 ఏడాదికి సంబంధించి నోబెల్ ప్రైజుల ప్రకటన సోమవారం (2025, అక్టోబర్ 6) నుంచి ప్రారంభమైంది. మంగళవారం సైన్స్, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం ఎకనామిక్స్.. చివరగా ఈ నెల 14న నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తారు. విజేతలకు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి సందర్భంగా డిసెంబర్ 10న పురస్కారాలు అందజేయనున్నారు.