
దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త వారంలో లాభాల ప్రయాణాన్ని స్టార్ట్ చేశాయి. ఉదయం నుంచి లాభాల జోరును కొనసాగించిన సెన్సెక్స్, నిఫ్టీలు సాయంత్రం వరకు అదే జోష్ కొనసాగించాయి. ప్రధానంగా నిఫ్టీ సూచీ సాయంత్రం 3 గంటల సమయంలో 585 పాయింట్ల లాభంతో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ కూడా 180 పాయింట్లకు పైగా పురోగతిని కలిగి ఉంది. నిఫ్టీ బ్యాంక్, మిడ్ క్యాప్ సూచీలు కూడా భారీగానే లాభాలతో ముందుకు సాగుతున్నాయి. అయితే సోమవారం ముందుకు నడిపించిన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. ముందుగా మార్కెట్లను సానుకూలంగా ప్రభావితం చేసిన అంశం బ్యాంకింగ్ స్టాక్స్ లలో కొనుగోళ్లు. రెండో త్రైమాసికంలో మంచి లాభాలను నమోదు చేయటంతో హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్స్ కొనుగోళ్ల జోరును చూశాయి. ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 450 పాయింట్లకు పైగా లాభపడింది.
2. భారతీయ మార్కెట్లను లాభాల్లో నడిపించిన మరో కీలక కారణం ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలు. జపాన్ మార్కెట్లు భారీగా లాభపడటంతో పాటు అమెరికా ఫ్యూచర్స్ గెయిన్ అవ్వటం ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి.
ALSO READ : ఇండియా ఈ వ్యర్ధాల బంగారు గని
3. మరో ముఖ్యమైన అంశం దేశీయ ఐటీ రంగానికి చెందిన షేర్లలో కొనుగోళ్లు నమోదు కావటం, నిఫ్టీ ఐటీ సూచీ కూడా 1.6 శాతం లాభపడటంతో ఐటీ కంపెనీల షేర్ల జోరు కొనసాగింది. ఇది ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్లను బూస్ట్ చేయటంలో దోహపడపడిందని నిపుణులు అంటున్నారు.
4. ఇక చివరిగా డాలర్ తో పోల్చితే రూపాయి మారకపు విలువ పుంజుకోవటం కూడా మార్కెట్ల సెంటిమెంట్లను బూస్ట్ చేసింది. ఈ పరిస్థితులు విదేశీ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపి దేశీయ మార్కెట్లలోకి పెట్టుబడి ప్రవాహాలను పెంచుతుందని నిపుణులు అంటున్నారు.