
పశ్చిమ బెంగాల్లో టెన్షన్..టెన్షన్..వరద బాధితుల ప్రాంతాలకు వెళ్లిన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేపై స్థానికులు దాడి చేశారు.ఈ దాడిలో ఎంపీ ముక్కు పగిలింది.ఎమ్మెల్యే స్వల్పగాయాలతో బయటపడ్డాడు.ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సోమవారం(అక్టోబర్6) పశ్చిమ బెంగాల్ లోని నాగ్రకట్టలో ఈ ఘటన జరిగింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన ఎంపీ ఖగేన్ ముర్ము, ఎమ్మెల్యే శంకర్ ఘోష్ కారును అడ్డగించిన స్థానికులు కారు అద్దాలు పగలగొట్టి వారిపై దాడి చేశారు. ఈ దాడిలో ముర్ము ముక్కు పగిలిపోయి తీవ్రంగా రక్త స్రావం అయింది. ఎమ్మెల్యే శంకర్ ఘోష్ చొక్కా చిరిగిపోయింది.. స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
ఎంపీ, ఎమ్మెల్యేలపై దాడి స్థానికంగా రాజకీయ దుమారం రేపింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే ఈ దాడులు చేయించిందని బీజేపీనేతలు ఆరోపిస్తున్నారు. వరద బాధితులకు సహాయక చర్యలు అడ్డుకునేందుకు ఈ దారుణానికి పాల్పడిందని అన్నారు.
►ALSO READ | ఇండియా ఈ వ్యర్ధాల బంగారు గని : 23 కోట్ల అక్రమ రవాణా సీజ్.. మీ పాత ఎలక్ట్రానిక్స్ కూడా విలువైనవేనా?