మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు ఈ ప్రభుత్వ పథకమే పోటీదారు..? కొత్త మార్పులతో మ్యాజికల్ రిటర్న్స్..

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు ఈ ప్రభుత్వ పథకమే పోటీదారు..? కొత్త మార్పులతో మ్యాజికల్ రిటర్న్స్..

ఈరోజుల్లో పెట్టుబడుల గురించి ఎవరి నోట విన్నా ముందుగా వినపడుతున్న మాట మ్యూచువల్ ఫండ్స్. ఒకప్పుడు ప్రభుత్వ పథకాలంటే పడిపోయే సామాన్య మధ్యతరగతి కూడా వీటిపై ప్రస్తుతం మనసు పారేసుకుంటున్నారు. అధిక రాబడులు పొందేందుకు వీలుగా నిపుణులు పెట్టుబడులను పర్యవేక్షిస్తుండటం చాలా మందిని అటుగా నడిపిస్తోంది. 

అయితే మ్యూచువల్ ఫండ్లకు కొత్త పోటీదారుగా ప్రభుత్వ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ కాబోతోందని ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్న నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ సంస్థ పెట్టుబడిదారులకు అనుకూలంగా అనేక కొత్త ఫ్లెక్సిబుల్ పెట్టుబడి ఎంపికలను ఎన్ పీఎస్ కింద అందించటమే దీనికి కారణం అని వారు చెబుతున్నారు. దీంతో ఇకపై పెట్టుబడిదారులు తమ లక్ష్యాలకు అనుగుణంగా 100 శాతం డబ్బును ఈక్విటీలో పెట్టుబడిగా పెట్టేందుకు అలాగే ముందుగానే ఎగ్జిట్ అయ్యేందుకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అవకాశాలను అందుబాటులోకి తెచ్చింది. 

ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు కాని ఇన్వెస్టర్లు మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్ వర్క్ కింద తక్కువ, మధ్యస్థ అలాగే అధిక రిస్క్ ఆప్షన్లను తమ పెట్టుబడుల్లో ఎంచుకోవచ్చని పెన్షన్ సంస్థ చెబుతోంది. దీంతో ప్రజలు తమ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను కస్టమైజ్ చేసుకోవచ్చని, ఇకపై 60 ఏళ్లు వచ్చేంత వరకు పెట్టుబడిదారులు ఎదురు చూడకుండానే పెట్టుబడిని 15 ఏళ్ల తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చని రూల్స్ మార్పులు చేయబడ్డాయి ఎన్ పీఎస్ విధానంలో. ఈ కొత్త విధానం పెన్షన్ సంస్థ కొత్త పెట్టుబడి ఉత్పత్తులను రూపొందించటానికి అవకాశం కల్పిస్తోంది. 

మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా తమ కొత్త పెన్షన్ ఫండ్ ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నాయి. వీటిలో ఈక్విటీకి అధిక కేటాయింపులు ఉండేలా చూసుకుంటున్నాయి. గతంలో ఉన్న పెన్షన్ సిస్టమ్ గందరగోళం నుంచి ప్రస్తుతం మార్కెట్ ఆధారిత కొత్త వ్యవస్థకు మారుతోందని, ఇది దశల వారీగా క్రమబద్ధీకరణను చూస్తోందని నిపుణులు అంటున్నారు. దీంతో యువ పెట్టుబడిదారులు కూడా వీటిపై దృష్టి పెడుతున్నట్లు వారు చెబుతున్నారు. అలాగే పన్ను విధానం గురించి పరిశీలిస్తే పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది. స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారించడానికి కార్పస్‌లో 20% యాన్యుటైజ్ చేయబడుతుంది. అలాగే 20% పన్ను విధించదగిన ఏక మొత్తంగా ఉపసంహరించుకోవచ్చు.. చివరిగా 60% పెట్టుబడి మెుత్తం పన్ను రహితంగా ఉంటుంది.