ప్రభుత్వాసుపత్రికి మారువేషంలో ఎమ్మెల్యే.. తలకు క్యాప్, ముఖానికి మాస్క్ తో..

ప్రభుత్వాసుపత్రికి మారువేషంలో ఎమ్మెల్యే.. తలకు క్యాప్, ముఖానికి మాస్క్ తో..

ప్రభుత్వాసుపత్రికి మారువేషంలో వెళ్లి అందరికీ షాక్ ఇచ్చారు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. శనివారం ( అక్టోబర్ 4 ) మడకశిర పట్టణంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రికి మారువేషంలో వెళ్లారు ఎంఎస్ రాజు. ముఖానికి మాస్క్, తలకు క్యాప్ తో అందరికీ షాక్ ఇచ్చారు ఎమ్మెల్యే. ఆసుపత్రిలోని రోగుల యోగక్షేమాలు అడిగి  తెలుసుకున్న ఎమ్మెల్యే.. డ్యూటీ డాక్టర్లు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని రోగులను అడిగి తెలుసుకున్నారు.

మారువేషంలో వచ్చిన ఎమ్మెల్యే రాజును చూసి ఆసుపత్రిలోని రోగులంతా అవాక్కయ్యారు. ఎమ్మెల్యే రాజు రూటే సపరేటప్ప అంటూ మడకశిర ప్రజలు ప్రశంశలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే మారువేషంలో ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆసుపత్రి సిబ్బంది సైతం మారువేషంలో ఉన్న ఎమ్మెల్యేను గుర్తుపట్టకపోవడం గమనార్హం.