
‘కూలీ’ చిత్రంలో ఎంతోమంది స్టార్స్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పింది శ్రుతిహాసన్. రజనీకాంత్ లీడ్ రోల్‌లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా శ్రుతిహాసన్ ఇలా ముచ్చటించింది.
‘‘నేను ఓ మ్యూజిక్ ఆల్బమ్ కోసం లోకేష్ కనగరాజ్ గారితో కలిసి వర్క్ చేశాను. ఆ టైమ్‌లో నేను సర్‌ప్రైజ్ అయ్యేలా ఈ క్యారెక్టర్ గురించి చెప్పారు. ఆయన గత చిత్రాల్లాగే ఇది కూడా గన్స్, యాక్షన్‌తో ముడిపడిన సినిమా. అయితే నా పాత్రను మాత్రం చాలా మంచి ఎమోషన్‌తో స్ట్రాంగ్‌గా డిజైన్ చేశారు. సత్యరాజ్ గారికి కూతురుగా కనిపిస్తా. ఓ అమ్మాయిగా ఆ క్యారెక్టర్‌కు పర్సనల్‌గా కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకులు కూడా కనెక్ట్ అవుతారనే నమ్మకముంది.
రజినీకాంత్ గారితో కలిసి పనిచేయడం అదృష్టంగా ఫీలవుతున్నా. నాన్నగారితో ఆయనకున్న స్నేహం గురించి, అప్పటి వర్కింగ్ స్టైల్ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. నిజంగా వారిది యూనిక్ బాండింగ్. ఆయన పాత్రతో పాటు నా క్యారెక్టర్ కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇక ఆమీర్ ఖాన్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. నా లైఫ్‌లోని ఓ ఇంపార్టెంట్ ఫేజ్‌లో ఆయన ఫ్యామిలీ నాకు తోడుగా ఉంది. ఆయనతో వర్కింగ్ ఫుల్ హ్యాపీ.
నాగార్జున గారు ఫస్ట్ టైమ్ విలన్ క్యారెక్టర్ చేశారు. తెలుగు ప్రేక్షకులు చాలా సర్‌ప్రైజ్ అవుతారు. ఇప్పటివరకూ నేను చాలామంది స్టార్స్‌తో కలిసి పనిచేశాను. కానీ ఇంతమంది స్టార్స్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. డీవోపీ గిరీష్ అద్భుతమైన విజువల్స్, అనిరుధ్ మ్యూజిక్ సినిమాను ఎలివేట్ చేస్తాయి. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా పెద్ద స్కేల్లో తెరకెక్కించారు.
లోకేష్ క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. మంచి కథ, అద్భుతమైన యాక్షన్, ఎమోషనల్ కోర్ ఉన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఇక నా సినిమా కెరీర్ గురించి ఆలోచిస్తే ఇదంతా ఓ బ్లెస్సింగ్‌గా భావిస్తాను. వర్క్‌ను ఎంజాయ్ చేస్తాను తప్ప భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించను. నేను పనిచేస్తున్న ప్రాజెక్ట్‌కు ఎంతవరకు న్యాయం చేయాలనే విషయంపై మాత్రమే దృష్టి పెడతాను’’.