ఇద్దరితో నటించడం అదృష్టం

ఇద్దరితో నటించడం అదృష్టం

ఓవైపు బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’.. మరోవైపు చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల్లో నటించింది శ్రుతిహాసన్. ఇవి రెండూ సంక్రాంతి కానుకగా ఈనెల 12, 13 తేదీల్లో విడుదల అవుతున్నాయి. ఈ సందర్భంగా శ్రుతిహాసన్ ఇలా ముచ్చటించింది. 

‘‘నేను నటించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడం ఇది రెండోసారి. అదికూడా చిరంజీవి, బాలకృష్ణ లాంటి బిగ్ స్టార్స్‌‌‌‌ సినిమాలు కావడంతో ఆనందంగా ఉంది. చాలా అదృష్టంగా ఫీలవుతున్నా. ఏ సినిమాలో నా క్యారెక్టర్ బాగుంది అని పోలికలు పెట్టుకునే అవకాశం లేదు. ఎందుకంటే రెండూ వేర్వేరు కథలు, వేర్వేరు పాత్రలు. ‘వీరసింహా రెడ్డి’లో నా పాత్ర ఫన్ ఫుల్‌‌‌‌గా ఉంటుంది. ‘వాల్తేరు వీరయ్య’లో కంప్లీట్ డిఫరెంట్. రెండు పాత్రలు చాలెంజింగ్‌‌‌‌గా ఉన్నవే. ‘వాల్తేరు వీరయ్య’లో నా పాత్రని దర్శకుడు బాబీ చాలా చక్కగా డిజైన్ చేశారు. చిరంజీవి గారితో ఓ ఫైట్ ఉంది.

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ చాలా మంచి కాన్సెప్ట్‌‌‌‌తో దాన్ని తీశారు. నాక్కూడా యాక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ ఫైట్ గురించి ఇప్పుడే చెప్పేస్తే  ప్రేక్షకులకు థ్రిల్ పోతుంది. ఇక ‘వీరసింహారెడ్డి’లో కామెడీ చేశా. చిరంజీవి, బాలకృష్ణ గార్లతో డ్యాన్స్ చేయడం నైస్ ఎక్స్‌‌‌‌పీరియన్స్. వారిద్దరూ చాలా మంచి డ్యాన్సర్లు. ‘సుగుణ సుందరి’ పాట వైడ్‌‌‌‌గా రీచ్ అయ్యింది. ‘శ్రీదేవి చిరంజీవి’ పాట కూడా అద్భుతంగా వచ్చింది.  ఇద్దరితోనూ పని చేయడం గొప్ప అనుభవం. బాలకృష్ణ గారు పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. దేవుడ్ని బలంగా నమ్ముతారు. చిరంజీవి గారు చాలా ప్రశాంతంగా, సున్నితంగా ఉంటారు. వారిద్దరి నుండి చాలా మంచి విషయాలు నేర్చుకున్నా. ఇక ఇవి రెండూ ప్రత్యేకమైన సినిమాలు. కథలు, పాత్రలు, ట్రీట్ మెంట్ డిఫరెంట్‌‌‌‌గా ఉంటాయి. రెండు సినిమాలకి డిఫరెంట్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఒక ఫ్యాన్‌‌‌‌.. ఆ హీరోని డైరెక్ట్ చేస్తే కచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. దీనికి నాన్న గారి (కమల్ హాసన్)తో లోకేష్ కనకరాజ్ తీసిన ‘విక్రమ్’ సినిమానే నిదర్శనం. బాలకృష్ణ గారితో  గోపీచంద్, చిరంజీవి గారితో బాబీ పని చేస్తున్నపుడు సెట్‌‌‌‌లో ఆ ఎనర్జీ కనిపించింది. తెరపై కూడా ప్రేక్షకులు ఆ ఎనర్జీని ఎంజాయ్ చేస్తారు. ఈ రెండింట్లో నేను నటిస్తున్నప్పుడు నాన్న చాలా హ్యాపీగా ఫీలయ్యారు’’.