ISRO: శుభాన్ష్ శుక్లా అంతరిక్ష ప్రయాణానికి డేట్ ఫిక్స్.. జూన్ 19న ఎక్సియం 4 మిషన్ లాంచింగ్

ISRO: శుభాన్ష్ శుక్లా అంతరిక్ష ప్రయాణానికి డేట్ ఫిక్స్.. జూన్ 19న ఎక్సియం 4 మిషన్ లాంచింగ్

శుభాన్స్ శుక్లా అంతరిక్ష ప్రయాణానికి డేట్ ఫిక్స్ అయింది. జూన్ 19న ఎక్సియం 4 మిషన్ లో భాగంగా శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కసిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లనున్నట్లు తెలిపింది ఇస్రో. ఈ మిషన్ వాస్తవానికి మే 29న ప్రయోగించబడాల్సి ఉంది. ఫాల్కన్ 9 రాకెట్‌లో ద్రవ-ఆక్సిజన్ లీకేజీ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోని జ్వెజ్డా సర్వీస్ మాడ్యూల్‌లో విడి లీకేజీ వంటి సాంకేతిక సమస్యల కారణంగా ఇప్పటికి నాలుగు సార్లు వాయిదా పడింది. సాంకేతిక లోపాలన్నీ రెక్టిఫై కావడంతో జూన్ 19న ఎక్సియం 4 మిషన్ లాంచింగ్ ఉంటుందని తెలిపింది ఇస్రో.

ఆక్సియం-4 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నాలుగవ ప్రైవేట్ వ్యోమగామి యాత్ర. ఇందులో భారత వ్యోమగామి శుభాన్ష్ శుక్లాతో పాటు పోలాండ్ ,హంగేరీకి చెందిన వ్యోమగాములు కూడా ఉంటారు. శుభాన్ష్ శుక్లా ఈ మిషన్‌లో పైలట్‌గా కీలక పాత్ర పోషించనున్నారు. ఈ 14 రోజుల మిషన్ లో భాగంగా  అంతరిక్షంలో సూక్ష్మగురుత్వాకర్షణ,జీవశాస్త్రానికి సంబంధించిన అనేక పరిశోధనలు చేయనుంది.  

శుభాన్షు శుక్ల ప్రయాణం భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ముఖ్యమైన మైలురాయి. భవిష్యత్తులో గగన్‌యాన్ మిషన్ ,భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే ప్రణాళికలకు ఇది విలువైన అనుభవాన్ని అందిస్తుంది చెబుతోంది ఇస్రో.  

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోని జ్వెజ్డా సర్వీస్ మాడ్యూల్‌లోని పీడన క్రమరాహిత్యాన్ని అంచనా వేయడానికి నాసాతో కలిసి పనిచేస్తున్నట్లు ఆక్సియమ్ స్పేస్ తెలియజేసింది. అయితే  కొత్త ప్రయోగ తేదీ గురించి యాక్సియమ్ స్పేస్ లేదా నాసా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

క్రూ డ్రాగన్ మాడ్యూల్ విద్యుత్ జీనులో సమస్యను గుర్తించిన తరువాత మే 29 న మొదట జరగాల్సిన ఈ ప్రయోగం జూన్ 8 కి వాయిదా పడిందని ఇస్రో తెలిపింది. ఆ తర్వాత దానిని జూన్ 9కి ఒక రోజు వాయిదా వేశారు. ఆపై జూన్ 10కి తిరిగి షెడ్యూల్ చేశారు. ప్రయోగానికి ఫాల్కన్-9 నౌక సాంకేతిక లోపం కారణంగా ఈ వాయిదా పడిందని తెలిపింది ఇస్రో. 

ALSO READ | 35 ఏళ్ళ లోపు వయసు వారైతే.. మీకే ఈ ఛాన్స్: ఎస్ఎస్పీఎల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్

అయితే జూన్ 10న జరగాల్సిన ప్రయోగం కూడా మరోసారి వాయిదా పడింది. ఈసారి రాకెట్ ఆరోహణ కారిడార్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మిషన్ ప్రయోగం వాయిదా పడింది. జూన్ 12 నాటికి స్పేస్‌ఎక్స్ ఆ సమస్యలను పరిష్కరించినప్పటికీ, ఐఎస్‌ఎస్ యొక్క జ్వెజ్డా సర్వీస్ మాడ్యూల్‌లో లీక్ గుర్తించబడిందని పేర్కొంటూ ఆక్సియమ్ స్పేస్,నాసా మరింత ఆలస్యాన్ని ప్రకటించాయి. అయితే ఆదివారం అవన్నీ తొలగిపోయి  ఫాల్కన్-9 నౌక ప్రయోగానికి సిద్దంగా ఉండటంతో జూన్ 19న ఎక్సియం మిషన్ ను ప్రారంభించనున్నారు.